లండన్‌లో 2.O పక్షిరాజా.. అతని వెంట పక్షిసైన్యం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

లండన్‌లో 2.O పక్షిరాజా.. అతని వెంట పక్షిసైన్యం (వీడియో)

February 4, 2020

London birds.

రజినీకాంత్ 2.o చిత్రంలో పక్షిరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లైమాక్స్‌లో డ్రోన్ పక్షులు చేసే బీభత్సం కన్నార్పనివ్వదు. అంత బీభత్సంగా లేకపోయినా ఇంచుమించు అలాంటి సీన్ ఒకటి లండన్ వీధుల్లో కనిపించింది. ఓ మనిషి ఆదేశాన్ని పాటించిన పక్షులు అతని వెంట దండులా బయల్దేరాయి. అతడు ఏ మాయ చేశాడో, ఏ మంత్రం వేశాడో అర్థంకాక జనం జుట్టుపీక్కుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సెంట్రల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ పార్కులో  దృశ్యం కనిపించింది. వీల్ చెయిర్‌లో వచ్చిన వ్యక్తి మొదట పక్షులతో సమావేశం నిర్వహించాడు. తర్వాత వాటిని తనవెంట రమ్మని సైగ చేశాడు. సైగ చెయ్యడమే ఆలస్యం అన్నట్లుగా కపోతాలు అతని వెంట కదిలాయి. కొన్ని అతనికంటే ముందే వెళ్లాయి. తర్వాత మళ్లీ అతన్ని అనుసరించాయి. కొన్ని వందల అడుగుల దూరం వెళ్లాడు. అవీ వెళ్లాయి. ఎదురుగా ఉన్న భవనంలోని వ్యక్తులు దీన్ని వీడియో తీశారు. పక్షిరాజా వద్ద తిండిగింజలు ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే పక్షులు అలా ఓ మనిషి వెంట వెళ్లడం ఇదివరకెన్నడూ తాము చూడలేని స్థానికులు నోళ్లు వెళ్లబెడుతున్నారు.