London commuters strip down, walk around half suited and booted for 'No Trousers Day'
mictv telugu

ప్యాంట్స్ లేకుండా ప్రయాణం చేశారు!

January 9, 2023

London commuters strip down, walk around half suited and booted for 'No Trousers Day'

‘నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్’ కోసం లండన్ లోని ప్రయాణికులు తమ ప్యాంట్స్ లేకుండా ఆదివారం అండర్ గ్రౌండ్ కి చేరుకున్నారు.
ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ 2020లో న్యూయార్క్ లో ఇంప్రూవ్ ఎవ్రీవేర్ అంటూ ప్రారంభించారు. వార్షిక గ్లోబల్ ఈవెంట్ ‘ది నో ప్యాంట్స్ సబ్ వే రైడ్’ ఇందులో భాగం. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక్క చోటని కాదు ప్రపంచంలోని అనేక ఇతర నగరాల్లో కూడా జరిగింది.
ఇంటర్నెట్స్లో ప్రజలు అండర్ గ్రౌండ్ లోకి ప్యాంట్స్ లేకుండా వెళుతున్నట్లు, టిక్కెట్ మెషీన్లు, ఎస్కలేటర్లు ఉపయోగించినట్లు ఫోటోలు విడుదలయ్యాయి.

లండన్ లో వేరుగా..

ఇక్కడ ట్రౌజర్స్ డే లేదు. కానీ ఈవెంట్ ని సరదాగా జరుపుకున్నారు. దీని ప్రకారం లో దుస్తులతో రైలులో ప్రయాణించడం. ఒక నివేదిక ప్రకారం.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఇంట్లో ప్యాంటు మరచిపోయినట్లుగా సహజంగా నడువాలని ఆదేశించారు. ప్రజలు కూడా అలాగే చేశారు. ప్రజలు ప్యాంటు లేదా స్కర్ట్ ధరించకుండా వారి సాధారణ కార్యకలాపాలను జరిపారు. పైగా కోట్లు, బూట్లు ధరించి తమ సాధారణంగా ఉన్నారు.

ఎలా మొదలైంది..

ఈ సంప్రదాయం గురించి తెలియాలంటే 2002కి వెళ్లాలి. అట్లాంటిక్ కు ఎదురుగా ఉన్న న్యూయార్క్ నగరంలో ఈ ఆచారం ఉద్భవించింది. ఈ నగరంలో కామిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ గ్రూప్, ఇంప్రూవ్ ఎవ్రీవేర్ ద్వారా ప్రారంభమైంది. ఏడుగురు వేసుకున్న ఒక ప్రాక్టికల్ జోక్ తో ఈ పద్ధతి ప్రారంభించారు. వీరందరూ అనుకొని ప్రతి స్టేషనల్ లో ఏడు వరుస స్టాప్ ల కోసం సబ్ వే రైలు ఎక్కారు. పైగా ఒకరినొకరు చూసుకోకుండా గడిపారు. అలా ఇది ప్రపంచ ఈవెంట్గా మారింది. ఇప్పుడు ప్రపంచంలో పలు చోట్ల ఈ డేని జరుపుతున్నారు. ఆ తర్వాత లండన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, లిస్బన్, టోక్యో.. ఇలా 60 వరకు నగరాలు ఈ డేని జరుపుతున్నాయి.

ఆ సమయంలో..

కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల నుంచి వేడుకలు లేవు. కానీ ఈ సంవత్సరం పాత ఉత్సాహంతో వేడుకను జరుపుతున్నారు. లండన్ లోని స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ నో ట్రౌజర్ ట్యూబ్ 2023 ఈవెంట్ ను బాగా చేసింది. ఈ ఈవెంట్ ప్రశాంతంగా సాగాలంటే సబ్ వేలో తమ ప్యాంట్స్ ని తీసేయాలి. తీశాక ప్రశాంతంగా ఉంటే వేడుక హాయిగా సాగినట్లే అంటున్నారు నిర్వాహకులు. చలికాలంలో మాత్రమే చేస్తే మరింత మజా కాబట్టి ఈ వేడకను మరింత ఉత్సాహంగా జరుపుకొన్నారు.