పక్షులు గుంపులుగా ఉంటాయి. ఒకదానికి కష్టం కలిగితే అన్నీ కలవరపడిపోతాయి. అయితే నిగెల్ మాత్రం ఒంటరిది. గ్యానెట్ అనే సముద్రజాతికి చెందిన ఈ పక్షి న్యూజిలాండ్‌లోని మానా ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ చనిపోయింది. వృద్ధాప్యం వల్లే ఇది మరణించిందని సంరక్షులు తెలిపారు.మానా ద్వీపంలోకి గ్యానెట్ పక్షులను మానాకు ఆకర్షించేందుకు వన్యప్రాణ సంరక్షకులు అక్కడ పక్షుల బొమ్మలు, నకిలీ ఆవాసాలను ఏర్పాటు చేశారు. దీంతో మూడు పక్షులు ఇక్కడి తరచూ వస్తున్నాయి. అయితే మళ్లీ తిరిగి వెళ్లిపోతున్నాయి. కానీ ఒక పక్షి మాత్రం బొమ్మ పక్షితో ప్రేమలోపడిపోయింది. బొమ్మేనే తన లోకంగా జీవిస్తోంది. దీంతో దీనికి ప్రపంచంలోనే ఏకైక ఒంటరి పక్షి అని పేరొచ్చింది. నిగెల్ మృతితో మిగతా గ్యానెట్ పక్షులు ఈ ద్వీపానికి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు సంరక్షుకులు.