శిరోజాల సింగారం.. గిన్నిస్ రికార్డులోకి గుజరాత్ యువతి - MicTv.in - Telugu News
mictv telugu

శిరోజాల సింగారం.. గిన్నిస్ రికార్డులోకి గుజరాత్ యువతి

January 16, 2020

Long Hair.

ఫ్యాషన్ మొజు పెరిగిన తర్వాత ఈ రోజుల్లో ఎక్కడో గాని పొడవైన జుట్టు కనపడటం లేదు. చాలా మంది యువతులు ఫ్యాషన్ పేరుతో వెంట్రుకలను కట్ చేసుకుంటున్నారు. చిన్నపాటి జడలతో దర్శనం ఇస్తున్నారు. కానీ అలాంటిది ఒక అమ్మాయి తన పొడవైన జుట్టుతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జడ ఉన్న యువతిగా రికార్డులోకి ఎక్కింది. ఈ వాలుజడను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

గుజరాత్‌కు చెందిన 17 సంవత్సరాల నీలాన్షీ పటేల్ అనే యువతి ఈ ఘతన సాధించింది. చిన్న వయస్సులోనే  1.90 మీటర్ల పొడవున జడను పెంచుకొని అత్యంత పొడవైన కురులను కలిగివున్న యువతిగా రికార్డు సాధించింది. దీంతో ఇప్పుడు ఆమె సెలబ్రెటీగా మారిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఎగబడతారు. దీనిపై ఆమె కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎంతో శ్రద్ధతో తాను గత 10 సంవత్సరాలుగా ఇంత పొడవైన జుట్టు పెంచుకున్నట్టు పేర్కొంది. కాగా 2018లో 170.50 సెంటీమీటర్ల పొడవైన కురులతో ఓ యువతి గిన్నిస్ రికార్డు సాధించగా.. ఇప్పుడు దాన్ని నీలాన్షీ పటేల్ బ్రేక్ చేసింది.