నెరవేరిన అర్చకుల చిరకాల స్వప్నం.. జీవో విడుదల.. - MicTv.in - Telugu News
mictv telugu

నెరవేరిన అర్చకుల చిరకాల స్వప్నం.. జీవో విడుదల..

October 21, 2019

jagan......................

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం నెరవేర్చే దిశలో అడుగులు వేస్తోంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టే క్రమంలో.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.

అర్చకుల చిరకాల స్వప్పమైన వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీవో 439 విడుదల చేశారు. 

ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోపై అర్చక సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా స్పందించారు. హిందూ, దేవాదాయ, ధార్మికతను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు,  చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్, రంగరాజన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 

కాగా, 2007లో అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. గత పదేళ్లుగా ఈ చట్టాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు.  పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.