ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా లక్ష మందితో లాంగ్ మార్చ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా లక్ష మందితో లాంగ్ మార్చ్..!

October 29, 2019

Imran Khan..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఆయన పాలన తీరు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వాదంపై ప్రజలు తిరగబడ్డారు. ఇస్లామాబాద్‌లో లక్షలాది మంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేపట్టారు.జమాతే ఉలెమాయె ఇస్లాం పార్టీ ఆధ్వర్యంలో ‘ఆజాదీ మార్చ్‌’ పేరుతో భారీ ర్యాలీ ప్రారంభించారు. 

ఈ ర్యాలీకి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈనెల 31న ఈ మార్చ్ ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ చేరుకోనుంది. కరాచీ సహా వివిధ నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాదాపు లక్షమందితో కూడిన ఈ ర్యాలీ రాజధాని వైపుగా సాగుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుచేయలని స్థితిలోకి వచ్చింది.