ఒక్క శ్వాసతో రికార్డు బద్దలు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క శ్వాసతో రికార్డు బద్దలు

August 17, 2017

మనం ఒకసారి శ్వాస తీసుకుని విడిచిపెట్టాక మళ్లీ శ్వాసతీసుకునేలోపు ఏ ఏ ఘనకార్యాలు చేయగలం? ఇదేం ప్రశ్న అని నొసలు చిట్లిస్తున్నారా? శ్వాసకు శ్వాసకు మధ్య కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉంటుందని, ఆ కొద్ది క్షణాల్లో ఘనకార్యాలు ఎలా సాధ్యమని మీరనుకోవచ్చు. కానీ ఈ వీడియో చూశాక.. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనంటారు.

వెనుజులాకు చెందిన గజ ఈతగాడు కార్లోస్ కోస్త్ ఒక శ్వాసలో ఏకంగా 580 అడుగుల 8.5 అంగుళాల దూరాన్ని(177 మీటర్లు) సునాయాసంగా ఈదిపారేసి గిన్నిరికార్డును బద్దలు కొట్టాడు. మూడు నిమిషాల 5 సెకన్లపాటు ఊపిరి బిగబట్టి ఈ ఘనత సృష్టించాడు. కార్లోస్ ఎవరిపేరుతోనో ఉన్న పాత రికార్డును కాకుండా తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. అతని కొత్త రికార్డు గత రికార్డుకంటే 27 మీటర్ల దూరం ఎక్కువ.
కరీబియన్ నెదర్లాండ్స్ లోని బోనైర్ ద్వీప తీరం ఇతగాడి రికార్డుకు వేదికైంది.