జస్ట్ 50 నాటౌట్.. చూస్తే యువతిలా... - MicTv.in - Telugu News
mictv telugu

జస్ట్ 50 నాటౌట్.. చూస్తే యువతిలా…

May 17, 2017

వయస్సు పెరిగే కొద్దీ బాడీలో మార్పులు వస్తుంటాయి. ఏజ్ ముదిరితే ముఖం ముడతలు పడటం పక్కా..కానీ చైనాలోని లియూ యెల్లిన్ అనే మహిళ 50 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా కనిపిపిస్తోంది. ఆమెకు 22ఏండ్ల కొడుకు ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. వీరిద్దరిని చూసిన కొందరు ఒకానొక సందర్భంలో ప్రేమికులు అనుకొని పొరబడుతుంటారట. ముడుతలు లేని ముఖం తో ఆమె అందంగా కనిపిస్తారు.

ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కఠోరమైన వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన భోజనం, సమతుల ఆహారం తీసుకుంటారు. అంతేకాదు ఆమె చలికాలంలోనూ సరస్సులో ఈత కొడుతుంటారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బరువును అదుపులో ఉంచుకునే కార్యక్రమాలు చేస్తారు.

HACK:

  • Chinese woman Liu Yelin looks like 20 at the age 50.
  • Exercise, balanced diet and swimming are her daily activities to seems like young.