ఈ సంక్రాంతి పండక్కి మంచి SUV కారు కొనాలని చూస్తున్నారా అయితే మహీంద్రా నుంచి వస్తున్న కొత్త థార్ వాహనం మంచి రెస్పాన్స్ రివ్యూస్ అందుకుంటోంది.మహీంద్రా థార్, మునుపటి కంటే తక్కువ ధరతో నేడు మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, జనవరి 9న విడుదల కానున్న మహీంద్రా ఈ సరసమైన వేరియంట్ గురించి తెలుసుకుందాం
మహీంద్రా థార్ RWD SUV మొత్తం 6 కలర్ వేరియంట్స్ లో వస్తోంది.. దీని డిజైన్ మునుపటిలానే ఉంటుంది. రాబోయే మహీంద్రా థార్ RWD SUV డిజైన్ దాని 4X4 వేరియంట్‌ను పోలి ఉంటుంది. మహీంద్రా థార్ ఈ వేరియంట్ దాని 4X4 కౌంటర్ వలె అదే టైర్లు మరియు అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగిస్తున్నారు.. మీరు రంగును ఇష్టపడితే, ఈ కారు కోసం అనేక ఎంపికలను ఎంచుకునే అవకాశం మీకు లభిస్తుంది.
మహీంద్రా థార్ RWD SUV ఇంటీరియర్ & ఇంజన్
లోపలి భాగంలో, మహీంద్రా థార్ RWD SUV మహీంద్రా థార్ 4X4 SUV మాదిరిగానే ఉంటుంది. మహీంద్రా థార్ SUV మహీంద్రా XUV300తో పంచుకునే 2.2-లీటర్ ఇంజిన్ యూనిట్‌కు బదులుగా అప్డేట్ చేసిన 1.5-లీటర్ ఇంజన్‌ను లభిస్తోంది. 2WD థార్ 4WD మోడల్ వలె ఇది 150PS 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను, ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో మార్కెట్లోకి వస్తోంది . ఇది కాకుండా, 2WD థార్ AX (O), LX ట్రిమ్‌లలో మరియు హార్డ్ టాప్, సాఫ్ట్ టాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉండనుంది.
మహీంద్రా థార్ 2డబ్ల్యుడి కోసం అధికారిక లాంచ్ తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. ధర గురించి చెప్పాలంటే, ఇది ప్రస్తుత థార్ కంటే దాదాపు లక్ష రూపాయలు చౌకగా ఉంటుంది. ఇది కాకుండా, మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీని కూడా ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేయవచ్చు. దీని ధర రూ.13.59 లక్షల నుంచి రూ. 16.29 లక్షల (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ప్రస్తుత మోడల్ కంటే రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.