తుపానులో దొంగలు పడ్డారు.. - MicTv.in - Telugu News
mictv telugu

తుపానులో దొంగలు పడ్డారు..

September 11, 2017


అమెరికాలోని ఫ్లోరిడా, ఓర్లాండో తదితర ప్రాంతాలను కబళించిన ఇర్మా తుపానును దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దొరికినకాడికి లూటీ చేసి పరారయ్యారు. వీరిలో 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరదల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. కొందరు కన్నాలు వేసి లాప్ ట్యాప్, టీవీలు వంటి వాటిని ఎత్తుకుపోయారు. కొందరైతే ఏకంగా తుపాకులనే లూటీ చేశారు. ఓర్లాండోలోని స్పోర్ట్స్ అకాడమీలోకి చొరబడిన దొంగలు అక్కడి గన్స్ ను ఎత్తుకెళ్లారు. పలు ప్రాంతాల్లో స్పోర్ట్స్ వస్తువులను అమ్మే షాపులు ఎక్కువగా లూటీకి గరయ్యాయి. దొంగలతోపాటు యువకులు కూడా వాటిని ఎత్తుకెళ్లారు. ఫోర్ట్ లారెల్డేల్ ప్రాంతంలో 28 ఏళ్ల యువకుడు ఏకంగా ఆరు ఇళ్లలో లూటీకి పాల్పడ్డాడు. వెస్టన్ బోవార్డ్ లో ఓ ఇంట్లో దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు కాళ్లపై కాల్చి గాయపరిచారు. నగరంలోని పలు ఇళ్లలో దొంగలు ఇళ్ల యజమానులను తుపాకీతో బెదిరించి డబ్బులు నగలు గుంజుకున్నారని ఓర్లాండో పోలీసులు చెప్పారు. పోలీసులు, జవాన్లు.. సహాయక చర్యలో తీరిక లేకుండా ఉండడం వల్ల చోరులు రెచ్చిపోయారని వెల్లడించారు.