Home > Featured > చరిత్రలో తొలిసారి.. ముస్లిం దేశ కరెన్సీపై గణపయ్య

చరిత్రలో తొలిసారి.. ముస్లిం దేశ కరెన్సీపై గణపయ్య

Currency ...............

పేరుకు ముస్లిం దేశమే. కానీ అక్కడ హిందూ దేవుళ్లకు అగ్రస్థానం కల్పిస్తున్నారు. అది ఎంతగా అంటే.. ఏకంగా కరెన్సీపైనే వినాయకుడి బొమ్మను ముద్రించేంత. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. తమ దేశంలోని 20వేల రూపాయల నోటుపై ఈ ప్రతిమను ముద్రించింది. స్వాతంత్య్ర సమరయోధుడు హజార్ దేవంతరా చిత్రపటం పక్కనే దీన్ని చేర్చారు. కరెన్సీపై హిందూ దేవుళ్లను చేర్చిన విషయాన్ని ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్తనుజ్ గార్గ్ ట్వీట్ చేయడంతో మరింత ప్రాచుర్యం లభించింది.

వాస్తవానికి ఇండోనేషియాలో హిందువుల మెజార్టీ చాలా తక్కువ. 87.2 శాతం ముస్లింలు ఉండగా హిందువుల సంఖ్య కేవలం 1.7శాతం మాత్రమే ఉంది. అయినా కూడా అక్కడ మొదటి నుంచి హిందూ దేవుళ్లను ఎక్కువగా ఆరాధిస్తారు. ఎన్నో హిందూ ఆలయాలు, విగ్రహాలు కూడా చాలా చోట్ల కనిపిస్తాయి. ముస్లిం దేశమనే భావన రాకుండా అక్కడ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. మరో విశేషం ఏంటంటే ఇండోనేషియా సైన్యం ఉండే ప్రాంతంలో ఏకంగా హనుమంతుడి విగ్రహం ఉంటుంది.బాలీ పర్యాటక లోగోను హిందూ పురాణాలు ప్రతిబింబించేలా రూపొందించారు. ఇప్పటికీ చాలా మంది ముస్లింలు అక్కడ హిందూ విశ్వాసాలను గౌరవిస్తారు. అందుకే అక్కడ మెనార్టీగా ఉన్న హిందువుల కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నారు. జకార్తాలో ‘అర్జున విజయ’ విగ్రహం ఆకట్టుకుంటుంటుంది. ఇండోనేసియా సైనిక నిఘా సంస్థ చిహ్నం హనుమంతుడు. బాండుంగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిహ్నంపైనా గణేశుడు ఉంటాడు.

Updated : 6 Sep 2019 6:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top