కరోనాను శ్రీకృష్ణుడే పంపాడు.. కాంగ్రెస్ నేత సిద్ధాంతం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను శ్రీకృష్ణుడే పంపాడు.. కాంగ్రెస్ నేత సిద్ధాంతం

June 29, 2020

Lord Krishna

కరోనా వైరస్ అలియాస్ ‘కోవిడ్ 19’ ఎలా వచ్చిందన్నదానిపై ఇంతవరకూ శాస్త్రవేత్తలే నికార్సయిన ప్రకటన చేయడం లేదు. గబ్బిలాలు, పొలుసు పందుల ద్వారా వచ్చిందని కొందరు, కాదు పాత వైరస్సే రూపు మార్చుకుందని కొందరు చెబుతున్నారు. కలికాలం, యుగాంతమని మనోళ్లు, వీరబ్రహ్మం ఎప్పుడో చెప్పారని కొందరు ఎవరికి తోచింది వాళ్లు అన్వేస్తున్నారు. 

తలపండిన కాంగ్రెస్ నేత మరో అడుగు ముందుకేసి ఏకంగా శ్రీకృష్ణభగవానుడే లోకంపైకి ఈ వ్యాధిని పంపాడని అంటున్నారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ దస్మానా ఈ మతిపోయే వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రథమాక్షర సిద్ధాంతాన్ని కూడా వల్లించారు. ‘కరోనా వైరస్‌, కృష్ణ అనే రెండు పదూ ‘క’ శబ్దంతో మొదలవుతాయి. అందుకే దీన్ని కృష్ణుడే మనపై వదిలాడు’ అని ఆయన టీవీ చర్చా కార్యక్రమంలో అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు హిందూ దేవతలను ఆడిపోసుకోవడం తప్ప మరో పనిలేదని, కాంగ్రెస్ పార్టీ పేరు కూడా క శబ్దంతోనే మొదలవుతుందని సటైర్లే వేస్తున్నారు.