రాముడు భారతీయుడు కాదు, నేపాలీయుడు..నేపాల్ ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

రాముడు భారతీయుడు కాదు, నేపాలీయుడు..నేపాల్ ప్రధాని

July 14, 2020

Lord Ram Was Nepali, Not Indian said Nepal Prime Minister

గత కొంత కాలంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్ ను టార్గెట్ చేసిన సంగతి తెల్సిందే. తొలుత భారత్ లోని మూడు భూభాగాలను తమవంటూ నేపాల్ పార్లమెంట్ బిల్ పాస్ చేయించారు. ఆ తరువాత భారతీయ న్యూస్ చానళ్లను ఆ దేశంలో నిషేధించారు. తాజాగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు భారతీయుడు కాదు నేపాలీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నేపాల్ కవి భానుభక్త జయంతి సందర్భంగా ఖాట్మాండులోని ప్రధాని నివాసంలో ప్రసంగించిన ఓలీ ఈ వ్యాఖ్యాలు చేశారు. అసలైన అయోధ్య భారత్‌లో కాదు నేపాల్ లో ఉందన్నారు. రాముడి జన్మ స్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో లేదని.. దక్షిణ నేపాల్‌లోని థోరీలో ఉన్న వాల్మికీ ఆశ్రమంలో సమీపంలో ఉందని తెలిపారు. 1814లో పశ్చిమ నేపాల్‌లోని తన్హూలో జన్మించిన భానుభక్త వాల్మికీ రామాయణాన్ని నేపాలీ భాషలోకి అనువదించారు. ఆయన 1868లో మరణించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా.. భారతీయులు, నేపాలీల మధ్య చిచ్చు పెట్టేలా ఓలీ వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.