అందరివాడు రాముడు కాదు.. కృష్ణుడు - MicTv.in - Telugu News
mictv telugu

అందరివాడు రాముడు కాదు.. కృష్ణుడు

November 20, 2017

ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ, విపక్ష సమాజ్‌వాదీ పార్టీల నడుమ విగ్రహాల పోటీ మొదలైంది. విగ్రహాలపై మోజుకు పెట్టింది పేరైన మాయావతి కథ కంచికి చేరడంతో ఈ కొత్త తమాషా జనాన్ని బాగా ఆకర్షిస్తోంది. అయోధ్యలో 100 అడుగుల రాముడి విగ్రహాన్న పెడతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పడం తెలిసిందే. దీనికి పోటీగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన సొంత గ్రామమైన సైఫైలో 50 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుబోతున్నాడు.ఈ వ్యవహారంలో సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ జోక్యం చేసుకుని రాముడికంటే కృష్ణుడే గొప్పవాడని పేర్కొన్నాడు. రాముడు కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమని, కృష్ణుణ్ని మొత్తం దేశమంతా పూజిస్తుందని ఆదివారం ఘజియాబాద్‌లో అన్నారు. లోకంలో రాముడికంటే శ్రీకృష్ణుడికే ఎక్కువమంది శిష్యులు ఉన్నారన్నారు. ‘దక్షిణ భారతదేశంలో రాముడికి బదులు శ్రీకృష్ణుణ్నే ఎక్కువగా కొలుస్తారు. రాముడు మన దేశానికే పరిమితం.. కృష్ణుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు..’ అని అన్నారు.

కాగా, అఖిలేశ్ పెడుతున్న కృష్ణుడి విగ్రహంపై యాదవకులం నుంచే విమర్శలు వస్తున్నాయి. కృష్ణుడు యాదవుడు కాడని, క్షత్రియుడని యూదవ్ కార్యవాహ్ కమిటీ నేత ఉత్పత్ యాదవ్ అన్నారు.