లారీకింద పడి ఏఎస్ఐ మృతి.. ఖమ్మంలో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

లారీకింద పడి ఏఎస్ఐ మృతి.. ఖమ్మంలో ఘోరం

March 30, 2018

ఖమ్మ జిల్లా పాలేరులో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపాలెం ఏఎస్ భాస్కర్ దుర్మరణం చెందారు. ఆయన మోటార్ బైక్‌పై విధులకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. భాస్కర్ బైక్‌ను ఢీకొట్టింది. ఆయన లారీ టైరు కింద పడిపోయారు.

లారీ ఆయన నడుంపైనుంచి వెళ్లడంతో అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. చుట్టూ ఉన్నవారు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక చూస్తుండిపోయారు. కొందరు వీడియోలు తీసుకున్నారు. భాస్కర్ అక్కడికక్కడే చనిపోయారు. లారీ కర్ణాటకకు చెందినది.