దుండగులు మోసాలు చేయడానికి పోలీస్ అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఓ దుండగుడు పోలీస్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి జనాల బురిడీ కొట్టించాడు. ఈ సంఘటన మరువకముందే ఈ తరహా సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో ఓ లారీ డ్రైవర్ పోలీసు అవతారమెత్తి 40 మంది మహిళలను అత్యాచారం చేశాడు. 35 ఏళ్ల లారీ డ్రైవర్ ఒకడు పోలీసు యూనిఫార్మ్ ధరించి పుజల్, రెడ్ హిల్స్ ఏరియాల్లో బైక్పై తిరిగేవాడు. ఆ ఏరియాల్లో తిరుగుతున్న అమ్మాయిలు, మహిళలను తాను పోలీస్నని బెదిరించి రేప్ చేసేవాడు.
రేప్ చేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసేవాడు. రేప్ గురించి ఎవరికైనా చెబితే ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. దీంతో బాధితులు ఎక్కడ నోరు విప్పలేదు. ఇలా దాదాపు 40 మంది ఆడవాళ్ళను అత్యాచారం చేశాడు. ఇటీవల ఓ యువతి ఆ దుండగుడి బెదిరింపులను తట్టుకోలేకపోయింది. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ విచారణలో ఆ దుండగుడు 40 మందిని రేప్ చేసాడని తేలింది. ప్రస్తుతం ఆ దుండగుడు రిమాండ్లో ఉన్నాడు.