Home > Featured > లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోపైకి దూసుకెళ్లిన లారీ 

లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోపైకి దూసుకెళ్లిన లారీ 

Lorry Went Upstairs on MRO

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరోనా డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోతో పాటు అతని సిబ్బంది పైనుంచి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్‌తో పాటు గిర్ధవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఏపీ - తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లాక్‌డౌన్ డ్యూటీలో భాగంగా రాత్రి అశ్వారావుపేట శివారులో అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారి వివరాలను సేకరించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఉన్న శిబిరంపైకి కొత్తగూడెం నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి వేగంగా దూసుకు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కకు తప్పుకున్నారు. అయితే అప్పటికే ఎమ్మార్వో ప్రసాద్, గిర్దవర్‌‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు, ఓ మేస్త్రి ముజాహిద్దీన్ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

Updated : 14 May 2020 9:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top