కూల్‌కు హాట్ చిచ్చు.. లారీ బీర్లు అగ్గిపాలు - MicTv.in - Telugu News
mictv telugu

కూల్‌కు హాట్ చిచ్చు.. లారీ బీర్లు అగ్గిపాలు

May 20, 2019

ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి… ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలను తట్టుకోవడానికి మందుబాబులు చల్లగా ఓ బీర్ లాగించాలని ఎగబడుతున్నారు. కానీ వైన్స్‌, బార్లలో తీవ్ర బీర్ల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బీర్ల లోడ్‌తో వెళ్తోన్న ఓ లారీ దగ్ధమైపోయింది.

కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో ఆఫీస్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగ మంటలు చెలరేగి వెంటనే లారీ మొత్తం వ్యాపించాయి. మంటలార్పేందుకు డ్రైవర్, క్లినర్ సకాలంలో ప్రయత్నించినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రయత్నంలో డ్రైవర్‌ గాయాలపాలయ్యాడు. స్థానికులు డ్రైవర్‌ను నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లారీ మొత్తం మంటల్లో చిక్కుకోవడతో.. మంటల్లో బీరు సీసాలు పేలుతున్నాయి… దీంతో గ్లాసు ముక్కలు ఎగిరిపడుతున్నాయి.