రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీకి కోలుకునేందుకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్.. మోదీని కోరారు. సోమవారం భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీకి సీఎంతో పాటు గవర్నర్లు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. వినతులతో కూడిన పత్రాన్ని మోదీకి ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
1. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన మొత్తం రూ. 34,125 కోట్లను విడుదల చేయాలి.
2. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ. 6,627 కోట్లను ఇప్పించాలి.
3. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా రూ. 55,548 కోట్లను ఆమోదించాలి.
4. కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు ఆర్ధిక సహాయం ప్రకటించాలి.
5. భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన క్లియరెన్సులు ఇవ్వాలి.
6. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలి.
7. రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా వ్యవహరించాలి.
పై కోరికలతో పాటు మరిన్ని వినతులను తీర్చాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు.