లక్ అంటే ఇతనిదే.. 21 కోట్ల జాక్‌పాట్ - MicTv.in - Telugu News
mictv telugu

లక్ అంటే ఇతనిదే.. 21 కోట్ల జాక్‌పాట్

April 3, 2018

అదృష్టలక్ష్మి ఎప్పుడు, ఎలా కరుణిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి చేతిలో ఒక్కరూపాయి కూడా లేకుండా ఇబ్బందిపెట్టే ఆ మహాతల్లి కొన్నిసార్లు చేతులు కాదు, ఇల్లు, బంగళాలు కూడా పట్టలేనన్ని రూపాయలను రాల్చేస్తుంది. పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన కేరళ వాసి జాన్ వర్గీస్ విషయంలో అదే జరిగింది. అతనికి నాలుగైదు జన్మల్లో కూడా సంపాదించలేనంత డబ్బును ఓ లాటరీ టికెట్ మోసుకొచ్చింది.

జాన్ వర్గీస్‌ ఇటీవల బిగ్ టిక్కెట్ లాటరీలో 093395 నంబరున్న టికెట్ కొన్నాడు. వేలమంది కొంటారు కదా, నాకే వస్తుందన్న గ్యారంటీ ఏంటని పెద్దగా ఆశపెట్టుకోలేదు. మంగళవారం అబుదాబిలోని బిగ్ టిక్కెట్ కార్యాలయంలో లాటరీ డ్రా తీశారు. లాటరీ కంపెనీ నుంచి జాన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మీ టికెట్‌కు 12 మిలియన్ దిర్హమ్స్(రూ.21కోట్ల 24 లక్షల 4వేలు) ప్రైజ్ మనీ తగిలిందని చెప్పారు. జాన్ మొదట నమ్మలేదు. ఏదో ఫేక్ కాల్ అనుకున్నాడు. అయితే అటువైపు వ్యక్తి బాగా వివరించి చెప్పడంతో ఉప్పొంగిపోయాడు.