Lottery Using Numbers He Saw In Dream American won 2 crore lottery
mictv telugu

కలలో కనిపించిన నంబర్.. 2 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు..

July 4, 2022

పగటి కలలు కనొద్దని పెద్దలు అంటున్నారు. అంటే రాత్రి కలలు కనొచ్చనేకదా. అటెంజో కోల్మాన్ అనే అమెరికన్ అలాగే రాత్రి కలలు కని ఏక్ దమ్ కోటీశ్వరుడయ్యాడు. కలలో కనిపించిన నంబర్‌తో లాటరీ టికెక్ కొని జాక్ పాట్ కొట్టాడు. రూ. 150 రూపాయల టికెట్ కొని జీవితాన్ని మార్చేసుకున్నాడు. వర్జీనియా రాష్ట్రానికి చెందిన కోల్మాన్ రిటైర్డ్ ఉద్యోగి. లాటరీ పిచ్చి బాగా ఉంది. ఎన్నిసార్లు కొన్నా అదృష్టలక్ష్మి కనికరించలేదు. రేయింబవళ్లు లాటరీ పిచ్చితో నంబర్లను టార్గెట్ చేశాడు.

ఓ రోజు కలలో తాను 13-14-15-16-17-18-19 నంబర్ల సెట్ టికెట్‌ను కొని జాక్ పాట్ కొట్టినట్లు కల వచ్చింది. మామూలుగా కలలో వచ్చిన విషయాలు చాలామందికి గుర్తుండవు. కోల్మాన్ మరే వ్యవహారం లేకపోవడం, ఆ నంబర్లు వరుసగా ఉండడంతో గురి కుదిరింది. కానీ అలాంటి నంబర్ టికెట్ ఎంత వెతికినా దొరకలేదు. గాలించి గాలించి ఒక జత తక్కువున్న 13-14-15-16-17-18ను రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. జూన్‌లో ఆ లాటరీ డ్రా తీయగా కోల్మాన్ నంబరుకు 2.5 లక్షల డాలర్లు (1.97 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చింది. ‘కలా, నిజమా’ అని మొదట అవాక్కయిన కోల్మాన్ ‘కలే నిజమైందని’ ఎగిరి గంతేశాడు.