పాస్‌పోర్టులపై కమలం గుర్తు..ఎందుకంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

పాస్‌పోర్టులపై కమలం గుర్తు..ఎందుకంటే..!

December 13, 2019

Lotus Symbol On Passport.

కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించడం కాకరేపింది. కేవలం ఆ గుర్తునే ఎందుకు చేర్చారంటూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ గుర్తు ( కమలం) కావడంతో పాస్‌పోర్టుపై ముద్రించడంపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం గుర్తును ఎందుకు ముద్రిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంకే రాఘవన్ జీరో అవర్‌లో ప్రశ్నించారు. దీనికి విదేశాంగశాఖ మంత్రి వివరణ ఇచ్చారు. 

జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలం గుర్తును కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ తెలిపింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఇలా చేశామని చెప్పుకొచ్చారు. నకిలీ పాస్‌పోర్టుల తయారీని అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని ముద్రించామని రొటేషన్ పద్దతిలో మిగితా గుర్తులను కూడా చేర్చుతామని అన్నారు. ఎటువంటి దురుద్దేశంతో దీన్ని ముద్రించలేదని చెప్పారు. దీనిపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్  కూడా స్పందించారు. ‘కమలం అనేది బీజేపీకి ఒక గుర్తు మాత్రమే. కానీ అది జాతీయ చిహ్నాల్లో ఒకటి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇలా చేశాం. మరో నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తాం’ అని స్పష్టం చేశారు.