ప్రేమ వ్యవహారం.. మెదక్‌లో యువకుడి హత్య - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమ వ్యవహారం.. మెదక్‌లో యువకుడి హత్య

May 20, 2020

Love

మెదక్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గేదెలు తోలుకెళ్తున్న అతణ్ని గుర్తు తెలియని దుండగులు దారి కాచి కర్రలతో దాడి చేసి చంపారు. దీని వెనక ప్రేమవ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. హతుడి కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్‌కు చెందిన నర్సింహులు అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది గిట్టని అమ్మాయి తండ్రి అతన్ని బెదిరించి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టించాడు. ఇది జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. 

బుధవారం ఉదయం నర్సింహులు గేదెలను తీసుకుని చేలకు వెళ్తుండగా దండగులు తీవ్రంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడినన అతణ్ని రామాయంపేట ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. అమ్మాయి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నర్సింహులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.