ప్రియుణ్ని బతికించుకోవాలని నోటితో శ్వాస అందించి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుణ్ని బతికించుకోవాలని నోటితో శ్వాస అందించి..

April 24, 2018

ప్రేమ గొప్పతనాన్నిపరిపూర్ణంగా వివరించే నిర్వచనాన్ని ఈ లోకంలో ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ప్రేమ నిర్వచనాలకు, పడికట్టు పదాలకు లొంగనిది. మనిషికి ఒక గుండె అయితే ప్రేమకు రెండు గుండెలు.. ఒకదాన్ని ఒకటి కాపాడుకోవడానికి ఆరాటపడిపోతాయి. కానీ కాలం క్రూరమైనది.. ఒక జంట గుండెల్లో ఒక గుండెను విషంతో ఆపేసి, మరోగుండెను విషమ స్థితిలోకి నెట్టింది. సిద్ధపేట జిల్లాలో జరిగిన ఈ ఉదంతం విన్నవారి, చూసిన వారి హృదయాలను కరిగిస్తోంది.

బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన 28 ఏళ్ల కె.సంతోష్‌రెడ్డి  అదే గ్రామానికి బి.రాణి ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోలేదని రెండు రోజుల కింద ఇళ్లు వదలి వచ్చారు. సిద్దిపేట కొత్త బస్టాండ్‌లో సోమవారం అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు.

టాయ్‌లెట్‌కు వెళ్లిన సంతోష్.. నురగలు కక్కుతూ బయటికొచ్చాడు. రాణి తన నోటి ద్వారా అతనికి శ్వాస అందిస్తూ నురగను బయటికి తీయసాగింది. ప్రమాదకరమని అక్కడున్నవారు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కాసేపటికి ఆమె కూడా అస్వస్థతకు గురైంది. స్థానికులు 108 వాహనంలో వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే సంతోష్ చనిపోయాడు. రాణి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుతోంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న నిరాశతో సంతోష్ విషం తాగి ఉంటాడని భావిస్తున్నారు.