Love couple Karnataka incident
mictv telugu

కారులో ప్రేమజంట సజీవ దహనం.. పెద్దలు ఒప్పుకోలేదని..

May 23, 2022

Love couple Karnataka incident

పిల్లలను అల్లారుముద్దుగా పెంచే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో మాత్రం కట్టుబాట్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు ససేమిరా అంటుండడంతో పిల్లలు నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట పెట్రోల్‌తో కారుకు నిప్పంటించి, అందులో కూర్చుని సజీవ దహనమైంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది.

బెంగళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ఇళ్లలో వీరి పెళ్లికి అడ్డు చెప్పారు. పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకునేబదులు చావడమే మేలనుకున్నారు. శనివారం ఇద్దరూ మంగళూరుకు వెళ్లి ఓ కారు అద్దెకు తీసుకుని ఉడిపి వైపు వెళ్లారు. తాము చచ్చిపోతున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆదివారం వేకువజామున బహ్మార్వ తాలూకా హెగ్గుంజె వద్ద కారుపై పెట్రోలు పోసి లోపల కూర్చుని కాలిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.