చౌటుప్పల్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోడానికి వెళ్తున్న ప్రేమజంట బలి.. - MicTv.in - Telugu News
mictv telugu

చౌటుప్పల్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోడానికి వెళ్తున్న ప్రేమజంట బలి..

October 12, 2020

Love couple tragedy choutuppal

హైదరాబాద్ శివారులోని చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంటను ఓ కారు బలితీసుకుంది. వేగంగా దూసుకెళ్లి అదుపు తప్పి స్కూటీ బలంగా ఢీకొట్టింది. యువతి అక్కడికక్కడే చనిపోగా, యువకుణ్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూశాడు. 

రంగారెడ్డి జిల్లా మన్నెగూడెం చెందిన శ్రీలత, నాగరాజు అనే యువతీ యువకులు కొన్నేళ్లుగా ప్రేమించుంటున్నారు. ఈ రోజు ఉదయం చెరువుగట్టు గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేసుకోడానికి స్కూటర్‌పై బయల్దేరారు. వీరి వెనకాల మరో ద్విచక్రవాహనంలో ఇద్దరు బంధువులు వెళ్లారు. చౌటుప్పల్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వేగంగా వస్తున్న కారు ట్రాఫిక్ సిగ్నల్ దాటి  ప్రేమజంట వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. శ్రీలత అక్కడికక్కడే చనిపోగా, నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని హైదరాబాద్ తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. బంధువుల బండిని కూడా కారు ఢీకొట్టడంతో దానిపై ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి టూవీలర్ నుంచి పెట్రోల్ లీకై కాలిపోయింది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రాణాలు తీసిన కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.