Love fails.. Movie suicide
mictv telugu

ప్రేమ విఫలం..సినీ నటి ఆత్మహత్య

September 19, 2022

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన తమిళ సినీనటి పౌలిన్ జెస్సిక అలియాస్ దీప (29) ఆత్మహత్య చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లేఖలో పేర్కొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి వివరాలను వెల్లడించారు.

”తమిళ సినీనటి పౌలిన్ జెస్సిక అలియాస్ దీప (29) శనివారం చెన్నై విరుగంబాక్కంలోని ఆమె ఫ్లాట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం బంధువులు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, స్పందించలేదు. దాంతో స్నేహితుడు ప్రభాకరన్ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, అప్పటికే ఆమె ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఆమె మృతికి ఎవరూ కారణం కాదని ఘటనా స్థలంలో దొరికిన లేఖలో రాసింది” అని పోలీసులు వెల్లడించారు.

ఇక, దీప విషయానికొస్తే..తమిళంలో ‘వైతా’ సినిమాలో కథానాయికగా, మరికొన్నింట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. దీప సొంతూరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇంద్రానగర్‌లో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అయితే, ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం దీప లేఖలో వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.