గుంటూరు ఎస్పీ ఆఫీసులో యువతి కోసం బాహాబాహీ  - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరు ఎస్పీ ఆఫీసులో యువతి కోసం బాహాబాహీ 

October 26, 2019

Love Issue Between Two Junior Assistants In SP Office

కాలేజీల్లో విద్యార్థులు అమ్మాయి కోసం కొట్టుకోవడం లాంటి ఘటనలు వింటుంటాం. కానీ ఏకంగా పోలీసు డిపార్ట్‌మెంట్లో పనిచేసే వ్యక్తులు తమతోటి పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని  కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. 

ఎస్పీ ఆఫీసులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు నాగరాజు, రుద్రనాథ్ అదే ఆఫీసులో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగినిపై మనసుపడ్డారు. ఇద్దరితో ఆమె చనువుగా ఉండటంతో గొడవకు దారి తీసింది. ఈ వ్యవహారం కారణంగా  రుద్రనాథ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో తోటి ఉద్యోగులు గుర్తించి అతన్ని హాస్పిటల్ చేర్పించారు. కాగా ఉద్యోగులు చేసిన పనితో శాఖ పరువు పోయిందని భావించిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తునకు ఎస్పీ సీహెచ్. వియజరామారావు ఆదేశించారు.