ఆమె సెలవంటూ వెళ్లిపోయింది.. ప్రేమోన్మాదులూ మారండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె సెలవంటూ వెళ్లిపోయింది.. ప్రేమోన్మాదులూ మారండి!

March 30, 2018

పెళ్లి చేసుకోలేదన్న అక్కసుతో ఓ ఉన్మాది కిరోసిన్ పోసి తగలబెడ్డంతో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన మైనర్ బాలిక శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసింది. 70 శాతం కాలిన గాయాలతో నరక యాతన అనుభవించి ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. తల్లదండ్రులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 17 ఏళ్ల ఈ బాలికపై మహ్మద్ సొహైల్(19) అనే యువకకుడు మంగళవారం కిరోస్ పోసి తగలబెట్టాడు. తనను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంటోందన్న కచ్చతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

గోల్నాక గంగానగర్‌లో ఈ ఘోరం జరిగింది. రియాజ్‌ఖాన్‌, అర్షియాబేగం దంపతుల కూతురు చదువు మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఖాదిరీబాగ్‌కు చెందిన సొహైల్‌ ఆమెకు పదోతరగతిలో క్లాస్‌మేట్. అతడూ చదువు మానేసి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ప్రేమించాలంటూ ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమ్మాయికి 15 రోజుల క్రితం వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు తల్లిదండ్రులు. ఇది గిట్టని మంగళవారం బాలిక ఇంటికెళ్లాడు. ఆమెతో గొడవపెట్టుకున్నాడు. కోపంతో అక్కడే క్యాన్‌లోని కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేరు. సొహైల్ కూడా గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను, సొహైల్‌ను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. సొహైల్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.