ప్రేమించలేదని పెళ్లికూతురిని పొడిచాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించలేదని పెళ్లికూతురిని పొడిచాడు..

April 3, 2018

అమ్మాయిలంటే ఆటబొమ్మలుగా భావిస్తున్నారు.  ప్రేమించే హృదయం వున్నవారు త్యాగం చేస్తారు గానీ హత్యలు చేయరు. కానీ కొందరు.. తమకు  దక్కని అమ్మాయి ఇంకొకరికి దక్కకూడదని దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది.  ఆర్టీవో బ్రోకర్‌గా పనిచేస్తున్న నందన్ అనే యువకుడు గత ఆరు నెలలుగా యువతి వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. అయినా అతను వెంటపడటం మానలేదు.మరోపక్క.. యువతి కుటుంబ సభ్యులు సాగర్‌ తాలూకా భీమనకోనే కప్పమనెలోని భరత్ అనే యువకుడితో ఆమెకు పెళ్లి కుదిర్చారు. సోమవారం వరుడి ఇంటి వద్ద పెళ్లి జరుగుతోంది. తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి సొంతం కావొద్దనుకున్నాడు నందన్. పెళ్ళికి వచ్చిన బంధువులందరూ ఆనందంగా వున్నారు. ఇంతలో నందన్ అక్కడికి వచ్చాడు. పచ్చని పందిరిలో నెత్తురు పారించాడు. పెళ్లి పీటల మీది నుంచి వధువును లాగి ఆమె పొట్టలో కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన వధువు బాబాయి గంగాధరప్ప పైనా దాడి చేశాడు. క్ణణాల్లో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.  తీవ్రంగా గాయపడిన వధువు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పెళ్లి కొచ్చిన వారంతా నందన్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.