సమాజంలో కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఇప్పటికీ పరువు హత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కూడా కులాంత వివాహలు వివాదమయ్యాయి. తాజాగా మరొక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పెళ్లితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలి బంధువులు ప్రియుడి ఇంటికి నిప్పంటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఇళ్లును దగ్థం చేశారు. హుజురాబాద్‌కు చెందిన రాజశేఖర్, సంజన కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం వేములవాడలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. అయితే యువతి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఆమె బంధువులు వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న రాజశేఖర్ ఇంటికి నిప్పంటించారు.ఈ ఘటనలో యువకుడి ఇళ్లు పాక్షికంగా కాలిపోయింది. రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.