ముద్దు ఇస్తానని కాలితో తన్నింది (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

ముద్దు ఇస్తానని కాలితో తన్నింది (వీడియో) 

September 28, 2020

Love Praposal.. Kicked to give a kiss boyfriend (video)

గాలిలో, నీటిలో, కొండపైన, ఆకాశంలో ఇలా ప్రేమికులు ప్రియురాలికి తమ లవ్‌ను సృజనాత్మకంగా ప్రపోజ్ చేయడం చూస్తున్నాం. అయితే ఓ క్రియేటివ్ లవ్ ప్రపోజ్ బెడిసికొట్టింది. దీంతో ఇద్దరు లవర్స్ నీళ్లల్లో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్‌ చేసేందుకు ఆమె కూర్చున్న బోటు వద్దకు వెళ్లాడు. బోటు అంచున నిల్చుని ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాడు. అందుకు ఆమె లేచి నిల్చుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. 

వెంటనే అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందామని భావించింది. ఇంతలో ఊహించని విధంగా పడవ బ్యాలెన్స్ తప్పింది. దీంతో ఆమె బోటులో పడబోతూ కాలితో ప్రియుణ్ని తన్నింది. ఆ దెబ్బకు అతను కూడా నీటిలో బోల్తాపడ్డాడు. అది చూసి అక్కడే ఉన్న కొందరు సదరు ప్రేమికుడిని నీళ్లలోంచి బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి గాయాలు లేకుండా ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రపోజల్‌ వీడియో తీసిన థియో శాంటోనాస్‌ సదరు వ్యక్తిని ఆమె ఎందుకు తన్నిందని ప్రశ్నించాడు. తాను కావాలని తన్నలేదని.. పట్టుతప్పి అలా జరిగిందని చెప్పాడు. ఏదేమైనా తన ప్రపోజల్‌ను ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. కాగా, థియో శాంటోనాస్‌ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతోంది.