యుద్ధ భూమిలో లవ్ ప్రపోజ్.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధ భూమిలో లవ్ ప్రపోజ్.. వీడియో వైరల్

March 12, 2022

 

bgf

రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ దేశంపై యుద్ధం ప్రకటించి దాదాపు రెండు వారాలు దాటింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రష్యా బలగాలు భీకరమైన దాడులు చేస్తూ, ఉక్రెయిన్‌లోని పలు ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ సైన్యం సైతం రష్యా బలగాలను ధీటుగా ఎదిరిస్తున్నాయి. యుద్ధానికి సై అంటే సై అంటూ ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలు సైతం రష్యా బలగాలను ఎదిరిస్తున్నారు.

ఈ క్రమంలో ఓవైపు భయంకరమైన యుద్ధం. మరోవైపు చెప్పలేని కన్నీరు. ఇలాంటి సమయంలో ఓ ఉక్రెయిన్ సైనికుడు ఓ యువతికి లవ్ ప్రపోజ్ చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఉక్రెయిన్ చెక్‌పోస్ట్ దగ్గర కొందరు కారులో వస్తుండగా, సైనికులు వారిని అడ్డుకున్నారు. వారందరినీ చెక్ చేయాలంటూ వెనక్కి తిరగమన్నారు. అందులో ఓ మహిళ వెనక్కి తిరిగి చూసేలోపు ఓ సైనికుడు మోకాలిపై కూర్చొని రింగ్‌తో తనకు ప్రపోజ్ చేశాడు. ఇదంతా అక్కడ ఉన్నవారు రికార్డ్ చేశారు. ఇది చూడడానికి చాలా క్యూట్‌గా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.