love today movies will be remake in hindi
mictv telugu

హిందీలోకి వెళుతున్న తమిళ సినిమా లవ్ టు డే

February 20, 2023

love today movies will be remake in hindi, movies

కథ కొత్తగా ఉంటే హిట్ గ్యారంటీ. దానికి తగ్గట్టే బాక్సీఫీస్ వసూళ్ళు కూడా దద్ధరిల్లుతాయి. యూత్ మెచ్చే సినిమాలు అయితే రికార్డు స్థాయి వసూళ్ళని రాబడుతూ ట్రేడ్ వర్గాలనే షాక్ కు గురిచేస్తున్నాయి. అలా ట్రేడ్ వర్గాలని సైతం షాక్ కు గురి చేసిన మూవీ `లవ్ టుడే`. 2022 నవంబర్ లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా కు హీరో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. చాలా కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించింది.

తమిళంలో కేవలం 5 కోట్ల బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కల్పాతి ఎస్. అఘోరం నిర్మించిన ఈ మూవీ వంద కోట్ల గ్రోస్ ని చేరుకుంది. తెలుగులో ఈ మూవీని దిల్ రాజు విడుదల చేశారు.తెలుగులోనూ అనూహ్యంగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్ళని రాబట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రాబట్టిన మొత్తం వసూళ్ళు 6 కోట్లు కావడం విశేషం.దీంతో ఈ మూవీ చాలా రోజులు హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిన్న సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీని నిర్మాత అర్చన కల్పాతి సోషల్ మీడియాలో చెప్పారు. బాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ కంపెనీ ఫాంటమ్ స్టూడియోస్ తో కలిసి ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. 2024 ప్రారంభం లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే హీరో ఎవరు?..డైరెక్టర్ ఎవరు? ప్రదీప్ రంనాథనే డైరెక్ట్ చేస్తాడా? అన్నది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు.

ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తమిళ తెలుగు మలయాళ కన్నడ వెర్షన్ లలో లవ్ టుడే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.