భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై ప్లాట్ గిఫ్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై ప్లాట్ గిఫ్ట్ 

September 23, 2020

“Love you to the moon & back,” Pakistani Man Buys Land on Moon For Wife As Wedding Gift

భార్య మనసు గెలుచుకోవడానికి కొందరు భర్తలు ఇచ్చే బహుమతులు అబ్బుర పరుస్తుంటాయి. ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే బంగారం రింగో, నెక్లెసో, లేదా ఫోన్ కొనిచ్చి భార్య ముఖంలో వెలుగు చూస్తారు భర్తలు. అయితే ఓ భర్త మరో అడుగు ముందుకు వేసి తన భార్యకు చంద్రిడిపై ప్లాట్ కొని గిఫ్టుగా అందించాడు. దీంతో ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురైంది. పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్యకు సి ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో ఓ ఎకరం స్థలం కొనుగోలు చేశాడు. దీని ధర 3300 ఉన్నట్టు అహ్మద్ వెల్లడించాడు. ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో ఈ స్థలం కొన్నాడు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన ఒరిజినల్ దస్తావీజులు ఇటీవలే అహ్మద్‌ చేతికి అందాయి. 

వాటిని తీసుకుని సరాసరి భార్య వద్దకు వెళ్లి ఆమె చేతిలో పెట్టి ‘ఇది నీకు నా బహుమతి’ అని చెప్పాడు. వాటిని చూసి ఆమె షాక్ అయింది. కాగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రునిపై స్థలం కొనుగోలు చేయడం వలన ఉపయోగం ఏముంటుంది? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉపయోగం లేకపోవచ్చు.. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు నివసించే అవకాశం ఉంది అని మరో నెటిజన్ సమాధానం ఇచ్చాడు. ఇదిలావుండగా దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌కు కూడా  గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేసే అలవాటు ఉండేది. 2018లో సుశాంత్ సింగ్ మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు. అతన్ని చూసి చాలామంది అక్కడ స్థలాలు కొనుగోలు చేశారు.