Lover Beats Two Persons After One Of Them Touched His Girl Friend.. Viral Video
mictv telugu

తన గర్ల్‌ఫ్రెండ్‌ను గోకినందుకు ఎంత వయలెంట్‌గా జవాబిచ్చాడంటే…

June 4, 2022

Lover  Beats Two Persons After One Of Them Touched His Girl Friend.. Viral Video

చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. మంచైనా, చెడైనా తిరిగిచ్చిస్తే ఆ కిక్కే వేరు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. పార్క్ లాంటి చోట నిల్చుని ఉన్న ఇద్దరు వ్యక్తుల.. రోడ్డుపై అటుగా వస్తున్న ఇద్దరు ప్రేమికులను గమనించారు. వారిలో ఒకడు… కావాలని ప్రేమికుల్లోని అమ్మాయికి తన చెయ్యి తగిలేలా చేశాడు. అంతే…క్షణం కూడా ఆలస్యం చేయని ఆమె లవర్… ప్రొఫెషనల్ ఫైటర్‌లా టచ్ చేసిన వాడి ముఖంపై వరుస పంచ్‌లు ఇచ్చాడు. ఆ వెంటనే మరో వ్యక్తిని కూడా పిడిగుద్దులు గుద్దడంతో… అతను కింద పడ్డాడు. ఆ వెంటనే టచ్ చేసిన వాణ్ని మళ్లీ కొడుతుంటే… అతను కూడా కింద పడ్డాడు. ఆ తర్వాత అతని ఫ్రెండుకి కూడా రెండోసారి కోటింగ్ ఇచ్చాడు.

చివరకు అతని గర్ల్‌ఫ్రెండ్ సర్దిచెప్పడంతో కూల్ అయ్యాడు. అక్కడి నుంచి వెళదామని వారించడంతో… ఇద్దర్నీ వదిలేశాడు. అలా వాళ్లు.. చేజేతులా అతని గర్ల్‌ఫ్రెండ్ జోలికి వచ్చి… ముక్కులు పచ్చడయ్యేలా చేసుకున్నారు. ట్విట్టర్‌లోని @HaymakerHub అకౌంట్‌లో ఈ వీడియోని మే 30, 2022న పోస్ట్ చేశారు. “ఇన్‌స్టాంట్ కర్మ ఎప్పుడూ సంతృప్తినిస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోని ఇప్పటివరకూ 17 లక్షల మందికి పైగా చూశారు. 46 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు… గర్ల్‌ఫ్రెండ్‌ని బాగా ప్రొటెక్ట్ చేశాడని కొందరు, వాళ్లకి తగిన శాస్తి చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.