Lover entered the wrong house while giving a letter to the girlfriend in rohtas
mictv telugu

ప్రియురాలి ఇంటికి వెళ్లబోయి.. పొరపాటున పక్కింట్లోకి..

July 11, 2022

ప్రెజెంట్ యూత్ అంతా తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు ప్రపోజ్ చేసేందుకు టెక్నాలజీనే వాడుతున్నారు. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్…ఇలా ఏదో ఒక మెసేజ్ యాప్‌లతోనో లేదంటే కాల్స్ ద్వారానో తమ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. అయితే కాస్త కొత్తగా ట్రై చేద్దామనుకున్న ఓ యువకుడు మాత్రమే తన ప్రేయసికి ప్రేమలేఖ ద్వారా తన ప్రేమను వ్యక్తపరుచుదామనుకున్నాడు. నిర్మలమైన తన ప్రేమను అక్షరాల రూపంలో రాసి, ఆమెను నేరుగా కలసి ఆ లెటర్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ సర్ప్రైజ్.. అతనికి షాకింగ్‌గా మారింది. ఒళ్లంతా గాయాలపాలయ్యేలా చేసింది. లవ్ లెటర్ చేత పట్టుకోని ఆ యువకుడు రాంగ్ అడ్రస్‌కు వెళ్లడమే అందుకు కారణం.

బిహార్‌.. రోహ్తాస్‌లోని బిక్రమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రియురాలికి లవ్ లెటర్ ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు.. పొరపాటున పక్కింట్లోకి దూరాడు. ఆ ఇంటి యజమాని రాకను గమనించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు డాబా మీదకు పరిగెత్తాడు. డాబాపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో దాక్కొన్నాడు. ఇన్ని తంటాలు పడ్డా.. చివరకు యజమానికి పట్టుబడ్డాడు. యువకుడిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు వర్నా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పక్కింట్లోని అమ్మాయికి లెటర్ ఇవ్వడానికి వచ్చి, పొరపాటున ఈ ఇంట్లోకి ప్రవేశించానని, అందువల్లే భయంతో పారిపోయానని యువకుడు తెలిపాడు.