ఇదో రకం పగ.. లవర్ తండ్రి షాపును తగలెట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇదో రకం పగ.. లవర్ తండ్రి షాపును తగలెట్టాడు..

September 26, 2020

Lover father's shop set on fire

ప్రేమను నిరాకరిస్తే అమ్మాయిపై యాసిడ్ పోసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రియురాలి కుటుంబంపై కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. నగరంలోని మానిక్‌పుర్‌కు చెందిన రాహుల్‌ పాశ్వాన్‌ అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఊళ్ళో ఏకాంత ప్రదేశాల్లో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఆ అమ్మాయి ఇంట్లో తెల్సింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు రాహుల్‌ను హెచ్చరించింది. వారిద్దనీ కలుసుకోనివ్వడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ ఈనెల‌ 10న ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న షాపును చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేశారు. తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపునకు నిప్పంటుకుందని అంతా భావించారు. అయితే 21న యువతి తండ్రి తన షాపునకు దగ్గరలోని ఓ షాపులో ఉన్న సీసీటీవీ కెమెరా ఫొటేజీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. రాహుల్‌ షాపులో నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.