పెళ్లిచేసుకుందామని పిలిచి.. బావిలో పూడ్చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిచేసుకుందామని పిలిచి.. బావిలో పూడ్చేశాడు

March 6, 2018

ప్రేమ పేరుతో ఘోరాలు పెరిగిపోతున్నాయి. నువ్వే నా ప్రాణం అని అమ్మాయిలను వలలో వేసుకుని, దగా చేసి చంపేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ప్రియుడు తను ప్రేమించిన యువతిని దారుణంగా కొట్టించంపి బావిలో పూడ్చేశాడు. పెళ్లి చేసుకుందాం అని పిలిపించుకుని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

మోత్కూరు మండలం భుజలాపురంలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. నరేష్ అనే యువకుడు భార్గవి అనే యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే త్వరగా పెళ్లి చేసుకుందామని ఆమె తరచూ అడిగేది. నరేష్‌కు భార్గవిపై మోజ తీరిపోయింది. ఆమెను ఎలాగైనా వదిలించుకుందామకున్నాడు. పెళ్లిచేసుకుందాం అని ఎండిపోయిన వ్యవసాయ బావి వద్దకు పిలిపించుకుని ఆమె తీవ్రంగా కొట్టి చంపాడు.

తర్వాత ఆ బావిలోనే పూడ్చేసిపోయాడు. మరుసటి రోజు మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు.  భార్గవి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నరేష్‌ను తమదైన శైలిలో ప్రశ్నించగా హత్య విషయం వెలుగుచూసింది. పోలీసులు భార్గవి మృతదేహాన్ని వెలికిశారు.