Lover Niharika arrested in Naveen Harihara Krishna case
mictv telugu

నవీన్-హరిహర కేసులో లవర్ నీహారిక అరెస్ట్

March 6, 2023

సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుణ్ని ‘గుడ్’ అన్న ప్రియురాలు నిహారికను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తులో పలు కీలక విషయాలు రాబట్టారు. తర్వాత నిహారికను, మరో స్నేహితుడు హసన్‌ను కూడా అరెస్ట్ చేశారు. హరిహర కృష్ణ నవీన్‌ను హత్యచేస్తాడని వీరికి తెలుసని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసులో నీహారిక పాత్ర లేదని రెండు రోజుల కిందట రాచకొండ సీపీ చౌహాన్ చెప్పడం గమనార్హం. నిందితుల చాటింగ్ వివరాలు, దర్యాప్తులో ఒప్పుకున్న విషయాలను మదింపు వేసుకుని నిహారిక పాత్ర ఉందని అదుపులోకి తీసుకున్నారు.

నవీన్‌ను కిరాతరంగా చంపిన హరిహర అవయవాల ఫోటోలను నీహారికకు పంపడం తెలిసిందే. హత్య జరిగిన స్థలానికి హరిహర, నిహారిక, హసన్ వెళ్లి చూశారని పోలీసులు చెప్పారు. నీహారికను నవీన్ కూడా ప్రేమిస్తున్నాడే అక్కసుతో హరిహర అతణ్ని అబ్దుల్లాపూర్ సమీపంలో చంపడం తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీసులు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. నవీన్ గుండె, పెదాలు వంటి అవయవాలను అతడు నీహారికకు వాట్సాప్ చేయగా, ఆమె గుడ్ అని మెసేజ్ పెట్టిందంటున్నారు.