బాయ్‌ఫ్రెండ్‌ కారుకు నిప్పంటించిన లవర్‌.. వీడియో వైరల్‌ - MicTv.in - Telugu News
mictv telugu

బాయ్‌ఫ్రెండ్‌ కారుకు నిప్పంటించిన లవర్‌.. వీడియో వైరల్‌

April 28, 2022

అమెరికాలోని విస్కాన్సిన్‌ మాడిసన్‌కు చెందిన కెల్లీ హేస్ అనే మహిళ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద ఉన్న కోపంతో అతడి కారుకు నిప్పంటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు షాక్‌కు గురై, ఇదేం బుద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఆ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీస్ అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోలో మహిళ మొదట కారులో ఇంధనం పోసి, ఆ తర్వాత లైటర్‌తో మంటలు అంటించే ప్రయత్నం చేసింది. దీంతో కారులోంచి ఒక్కసారిగా మంటలు బయటకు వచ్చాయి. సమయస్ఫూర్తితో ఆమె మంటలను నుంచి తప్పించుకుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కెల్లీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆమెకు పెను ప్రమాదం నుంచి బయటపడిందని, ఏ మాత్రం లేట్‌ అయిన ఆమె మంటల్లో చిక్కుకుపోయేది అని అధికారులు తెలిపారు.