ఫేమస్ అవ్వాలని ప్రియుడ్ని ఏం చేసిందంటే..? - MicTv.in - Telugu News
mictv telugu

ఫేమస్ అవ్వాలని ప్రియుడ్ని ఏం చేసిందంటే..?

June 29, 2017


అవురా ఫేమస్ అవ్వాలంటే ఏం జెయ్యాల్రా అని అడిగితే..ఏం లేదురా ఓ పేద్దరాయి దీస్కొని ఎమ్యెల్యేదో, మంత్రిదో నెత్తి వలగ్గొట్టు అని శెప్పిండట ఎన్కటికి ఎవడో బుద్దిమంతుడు,అగో సేమ్ అట్లనే ఉన్నది గీమె ముచ్చటగుడ..యూట్యూబ్ ల స్టార్ అయిపోదాం..మస్తు పైసలు సంపాయిద్దాం అని ఆశతోని దిక్కుమాలిన యూట్యూబ్ స్టంట్ జేశింది..అదేంటంటే సింపుల్..

తుపాకి దీస్కొని బాయ్ ప్రేండ్ గుండెల్లో ఒక్క రౌండ్ గాల్శిందట,గంతే గ బాయ్ ప్రెండ్ పైకివోయిండు,ఆమె జైళ్లకొయ్యింది,గిది మనదేశంల గాదు అమెరికా జర్గింది, బ్యాయ్ ప్రెండ్ చాతిమీద ఓ బుక్కువెట్టి ఆ బుక్కుమీద కాల్శిందట పుణ్యత్మురాలు మరి బుక్కుల కమ్మలు తక్కువున్నయో…బుక్కు బుడ్డగుందోగనీ ఉత్తగనే మనోడు బుక్కపోయిండు,గీమె పేరు మోనాలిసా నట,పేరు మాత్రం ఫేమస్ పిక్చర్ ది వెట్కొని మనోని ఫోట్వకు దండేశిదన్నట్టు, అయినా తుపాకీతోని కాలుస్తా అంటే గ బిత్తిరోడు ఎట్లెప్పుకున్నడో….ఒకదారిల ఫేమస్ అవ్వాలని అన్కుంటే…గిట్ల జైల్ల ఊసలు లెక్కవెట్కుంట ఇంకోదారిల ఫేమసైందన్నట్టు,పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో,మీరుగుడ లారీల కొద్ది లైకులు రావాల్నని,బొచ్చెడు కామెంట్లు రావాల్నని, రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాల్నని గీళ్లలెక్కనే పిచ్చి పిచ్చి పనులు జేశెరు.,