ప్రేమికులను విడదీయకండి.. ఇదే మా లాస్ట్ వీడియో.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికులను విడదీయకండి.. ఇదే మా లాస్ట్ వీడియో..

April 16, 2019

కులమతాల అడ్డుగోడలు, ఆస్తి అంతస్తుల్లో తారతమ్యాలు.. ప్రేమజంటలను బలితీసుకుంటునూ ఉన్నాయి. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. అంతుకు ముందు ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. ప్రేమికులను విడదీయొద్దని వేడుకుంది.

Lovers commits suicide with facebook live as their parents rejected marriage proposal in chandragiri of chittoor district andhra Pradesh

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వారిద్దరూ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. మృతులను మొరవపల్లెకి చెందిన ధనంజయ, శ్రీకాళహస్తికి చెందిన పల్లవిలుగా గుర్తించారు. ధనంజయ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమించకుంటున్న వీరు ఇటీవల తమ ప్రేమ గురించి ఇళ్లలో చెప్పారు. రెండు కుటుంబాలూ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇళ్ల నుంచి వచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత  సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రేమికులను విడదీయొద్దని కోరుతూ గుడ్ బై చెప్పేసిన ఆత్మహత్యకు పాల్పడ్డారు.