పాఠశాలలో ఉరి వేసుకున్న ప్రేమజంట - MicTv.in - Telugu News
mictv telugu

పాఠశాలలో ఉరి వేసుకున్న ప్రేమజంట

May 16, 2019

Lovers committed suicide in college.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తార(19) అనే ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తల్లిందండ్రులకు తెలియడంతో మందలించారు. అయినా కూడా వీరు ప్రేమించుకోవడం ఆపకుండా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లిని పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.