Lovers couple at river scene
mictv telugu

చెట్ల చాటున ప్రేమజంట.. ఏం చేస్తున్నారో మీరే చూడండి!

August 8, 2022

అనగా అనగా ఓ ఏరు. ఏటి ఒడ్డున అరుగు. అరుగుపై పెద్ద చెట్టు, దాని ఆనుకుని చిన్నచెట్లు. చెట్ల మాటన ఓ ప్రేమజంట. కాస్తా చాటుగా ఉంది కాబట్టి చూడగానే వాళ్లు లవర్లు అని అనుకోవచ్చు. అతడు ఆమె వెనకాల కూర్చుని ఉన్నాడు. మీరు చప్పున ఈ దృశ్యాన్ని చూస్తే, ‘చెట్లచాటు ఏం చేస్తున్నారబ్బా?’ అని ఆలోచనలు ఎటోటో పోతాయి. కానీ, ఓపికగా జూమ్ చేసి చూస్తే ‘వార్నీ’ అని అని నవ్వుకుంటారు. అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఓ పర్యాటక ప్రాంతంలో కనిపించిందీ దృశ్యం. ప్రియుడు ప్రియురాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని చక్కగా పేలో, తెల్లవెంట్రుకలో చూస్తున్నాడు. ఈ చాటుమాటు ప్రేమాయణం మరీ వింతంగా ఉండడంతో నెటిజన్లు నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదింకా లేత జంట అని కొందరంటుంటే, అసలు ప్రేమజంట కాదేమో, ఓన్లీ ఫ్రెండ్సేమో అని మరికొందరు అంటున్నారు. ఏది ఏదైమనా పైకి కనిపించేందంతా నిజం కాదనడానికి ఇదే ఉదాహరణ అని మరికొందరు ముక్తాయిస్తున్నారు.