Lovers in Delhi metro clash over small issue
mictv telugu

రైల్లో కొట్టుకున్న ప్రేమికులు.. పెళ్లయ్యాక పరిస్థితి ఏమిటో?

July 16, 2022

ప్రేమికుల మధ్య గిల్లి కజ్జాలు తప్పకుండా ఉండాలి. లేకపోతే మజానే ఉండదు. కానీ ఏదైనా మోతాదుకు మించి ఉండకూడదు. మరీ పబ్లిక్కులోనే కొట్టుకునే దాకా రాకూడదు. ఒకవేళ వచ్చినా చూడ్డానికి గమ్మత్తుగా ఉంటుందే తప్ప తర్వాతి పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఎవరి లిమిట్స్‌లో వాళ్లండక తప్పదు. లిమిట్స్ అంటే ఆయా మనుషులను బట్టి ఉంటాయనుకోండి, అది వేరేసంగతి. చెప్పొచ్చేదేమంటే, ఓ జంట మెట్రో రైళ్లో చెంపలు వాయించుకుంది ముద్దుగా. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పడేయంతో చూసిన వాళ్లు, ‘ఇప్పుడే ఇలాగైతే పెళ్లయ్యాక పరిస్థితి ఏమిటో?’ అని ఆందోళన పడుతున్నారు.
ఢిల్లీ మెట్రోలో ఈ కొట్టుడు జరిగింది. అమ్మాయి తాను కొన్న టీషర్టును చూపుతూ వెల వెయ్యి రూపాయలు అని చెప్పింది. అబ్బాయి సరదాగా, ‘150కే వస్తుందిది’ అని ఎద్దేవా చేశారు. అమ్మాయి రెచ్చిపోయింది. అవమానిస్తావా అంటూ లవర్ని పిచ్చకొట్టుడు కొట్టింది. అంతేకాకుండా, ‘మా అమ్మకు చెప్తా’ అని బెదిరించింది. అతడు మొదట కూల్‌గా ఉన్నా, ఎంతయినా మనిషి కాబట్టి ఘాటుగానే స్పందించాడు. ‘నీలాంటి లవర్ ఎవరీకి వద్దు’ అని అన్నాడు. ఆమె మళ్లీ కొట్టింది. అతడూ ఆమె ముఖంపై కొట్టాడు కాస్త సుతారంగానే. ఇంతలో స్టేషన్ రావడంతో ఇద్దరూ దిగిపోయారు. తర్వాత కథ కంచివి వెళ్లిందో, బ్రేకప్ అయ్యిందో తెలీదుగాని, ఎమోషన్స్ మాత్రం శ్రుతి మించకూడదని ఈ వీడియో చెబుతోంది.