ప్రేమికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎవరికీ కనబడకుండా కాలం గడిపేందుకు నానా కష్టాలు పడాలి. ఎక్కడ బయట పడితే ఎవరు చూస్తారో…ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారో అని భయం. కానీ అన్నీ రోజులు ఒకేలా ఉండవుగా.. ఏదో ఒక రోజు బండారం బయటపడాల్సిందే. ఇటీవల ఏకాంతంగా ఉన్న కొన్ని ప్రేమ జంటలపై తల్లిదండ్రులు దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మరో ప్రేమ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ రెస్టారెంట్‌లో కుటుంబసభ్యులకు దొరికిపోయింది. అది కూడా వాలంటైన్స్ డే రోజునే అడ్డంగా బుక్కై చెప్పు దెబ్బలు తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Desi Parents #HappyValentinesDay 🤪🤪 pic.twitter.com/Tj4qKvAVW8
— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) February 14, 2023
ప్రేమికుల రోజును పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రేమ జంట ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఓ మహిళ వచ్చి చెప్పుతో ఎడపెడా ఇద్దరిని వాయించేసింది. వద్దని ప్రాధేయపడుతున్న వినకుండా చితక్కొట్టింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను షేర్ చేశారు. ఆ మహిళ యువతీయువకుల్లో ఒకరికి తల్లి అయి ఉంటుందని నెటిజన్లు అనుమానిస్తున్నారు.