lovers were beaten up and then married in Bihar
mictv telugu

పొలాల్లో జంట.. కొట్టి పెళ్లి చేసిన ఊరోళ్లు

June 22, 2022

రాంగ్ నంబర్ ద్వారా కనెక్ట్ అయ్యి.. ఊరి చివర పొలాల్లో మీటింగ్ అవుతున్న ఆ జంటను గ్రామస్తులు పట్టుకున్నారు. వెంటనే యువతి పెద్దలకు ఈ విషయం గురించి సమాచారం అందించగా.. వారిద్దరి ఊర్లోని ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. ఈ ఘటన బీహార్‌లోని బెట్టియాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ (20), సుమన్ కుమారి (22)లు రాంగ్ నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆ పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా.. దాని తర్వాత ఇద్దరూ తరచుగా కలుసుకునేంతగా బంధం ఏర్పడింది.
ఈ నెల 18న కూడా వారిద్దరూ గ్రామ శివార్లలోని పొల్లాలో కలుసుకున్నారు. అయితే కొందరు గ్రామస్తులు వారిని చూసి పట్టుకున్నారు. యువతిని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని కొట్టారు. అనంతరం గ్రామంలోని రామజానకి ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. విశేషమేంటంటే.. ఆ యువతి తన ప్రియుడి కంటే రెండేళ్లు పెద్దది. ఆ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.