ప్రాణాలకు తెగించి మరీ రొమాన్స్ చేసిన ప్రేమికులు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాలకు తెగించి మరీ రొమాన్స్ చేసిన ప్రేమికులు.. వీడియో వైరల్

April 23, 2022

ఈ మధ్య ప్రేమికులు మరీ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా, సినిమాలు, పాశ్చాత్య ప్రభావం వలన తామేం చేస్తున్నారో సోయి లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వారిని దుమ్మెత్తిపోస్తున్నారు.

కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట ప్రధాన రహదారిపై ప్రేమికులు ఇద్దరు బైకుపై వెళ్తున్నారు. సాధారణంగా అబ్బాయి వెనుక కూర్చోవాల్సిన యువతి పెట్రోల్ ట్యాంకుపై యువకుడికి ఎదురుగా కూర్చొని ప్రియుడిని వాటేసుకుని ముద్దులు పెడుతూ ఉంది. అమ్మాయి ఇలా ముద్దులు పెడుతూ ఉంటే అబ్బాయి రెచ్చిపోయి ర్యాష్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా భారీ వాహనాలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా రాసలీల కొనసాగించారు. ఇదంతా వారి వెనుక వెళ్తున్న మరో ప్రయాణీకుడు తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై సోషల్ మీడియానే కాక, కర్ణాటక మీడియా సంస్థలు కూడా పలు కథనాలను ప్రసారం చేశాయి.