చిన్న సినిమాకు థియేటర్లు కరువు ? - MicTv.in - Telugu News
mictv telugu

చిన్న సినిమాకు థియేటర్లు కరువు ?

August 29, 2017

‘మిస్టర్ ఐటం’ లో బడ్జెట్ సినిమా. దక్కనీ హైదరాబాదీలో వచ్చిన సినిమా ఇది. హిందీ ఫ్లేవర్ కూడా మిక్స్ అయిన మంచి ఎంటర్ టైనర్. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది రమేశ్ కిషన్ గౌడ్. అతనే ఈ సినిమాలో హీరోగా కూడా నటించాడు. SRK ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో సూరపనేని రఘునందన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురయ్యింది. చిన్న సినిమా అవడంతో థియేటర్ల కొరత ఏర్పడింది. దీంతో దర్శకుడు ఒక కొత్త పంథాను ఎంచుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్లకు రుసుము చెల్లించి రిలీజ్ చేసేంత దమ్ము తన దగ్గర లేదు. అందుకే..  స్వశక్తితో ఈ సినిమాను విడుదల చెయ్యాలని ప్లాన్ చేసాడు. అలా జూలై 18 న హైదరాబాదు సహా ఆదిలాబాద్, నిజామాబాద్, ఇచ్ఛోడా వంటి నైజాం ఏరియాల్లో సినిమాను రిలీజ్ చేశాడు.  సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.

కానీ ఎక్కువ రోజులు చిన్న సినిమాకు ఎవరిస్తారు థియేటర్లు చెప్పండి ? అప్పట్లో శేఖర్ కమ్ముల సైతం తన ఫస్ట్ సినిమా ‘ ఆనంద్ ’ కు కూడా ఇలాంటి చాలా సమస్యలను ఎదుర్కున్నాడు. ఇప్పుడు రమేశ్ కిషన్ పరిస్థితి కూడా అలాగే వుంది. తను ఆదిలాబాద్ వాస్తవ్యుడు అవడంతో మరాఠీ, హిందీ భాషల మీద తనకు మంచి పట్టుంది. సో విదర్భ డిస్ట్రిబ్యూషన్ పద్ధతిన ఈ సినిమాను సెప్టెంబర్ 10 తర్వాత మరఠ్వాడా ఏరియాలైన నాగ్ పూర్, ఔరంగాబాదు, పర్బని, నాందేడ్, బసవ కళ్యాణం, ఉద్గిర్ లలో రిలీజ్ చెయ్యనున్నాడట. వన్ మేన్ ఆర్మీలాగా తన సినిమాను తనే భుజాల మీద వేస్కొని రిలీజ్ చేస్కుంటున్న రమేశ్ కిషన్ గోస చూసైనా థియేటర్ల మీద డేగ కన్నేసి వుంచిన కొందరు మారితే బాగుంటుంది. లేకపోతే చిన్న సినిమాలకు భవిష్యత్తు కొరవడుతుంది ??